June 14 2025జూన్ 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ సా.4.19 కు తదుపరి చతుర్థి సా.4.00 కు 15 సా.4.00 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.36 కు తదుపరి శ్రవణం 15 రా.11.51 కు
యోగం: బ్రహ్మ మ.1:12 కు తదుపరి ఐంద్ర 15 మ.12:19 కు
కరణం: విష్టి మ.3.47 కు తదుపరి బవ రా.3.52 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:29-8:21 కు
వర్జ్యం: ఉ.7.05-8.43 కు & రా.3.39-5.15 కు
అమృతకాలం: సా.05:41-07:21 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:30 కు

🕉️సంకష్టహర చతుర్థి🕉️

గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.
జీవితంలో అనేక సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు కృష్ణపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఈ సంకష్టహర చతుర్థీవ్రతం ఆచరించడం వలన మహాపాపాలు పోతాయి. - శ్రీ గణేశపురాణం
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.

expand_less