" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 14 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : ఏకాదశి ఉ. 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి ద్వాదశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : అశ్విని మ. 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : అతిగండ తె. 03గం౹౹01ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : బాలవ ఉ. 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹33ని౹౹ నుండి 12గం౹౹25ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 11గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు & రా. 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹29ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹53ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹31ని౹౹కు 🕉️జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి (అపర ఏకాదశి)🕉️ ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము గురువారం (15వ తేదీ) ఉ. 9 గం.ల లోపు చెయ్యాలి. గురుబోధ జ్యేష్ఠ బహుళైకాదశి అపరా అనబడుతుంది. ఈ తిథి నాడు ఉపవసించి, ద్వాదశి నాడు వామనావతారంలో ఉన్న విష్ణువును పూజించి, విప్రునకు భోజనం పెట్టినవాడు సకలపాప విముక్తుడై వైకుంఠం పొందుతాడు. యథావిధిగా స్నానం ఆచరించి ఉపవాసం ఉండి భగవంతుని దర్శనం చేసుకోవాలి. దానధర్మాలు చేయడం చాలా మంచిది. ఈ రోజు నారాయణుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించాలి. గురుధ్యానం, గురుస్మరణం సకలశుభఫలితాలనిస్తుంది.