June 13 2025జూన్ 13 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 13 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ సా.4.09 కు తదుపరి తదియ 14 సా.4.19 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.10.49 కు తదుపరి ఉత్తరాషాఢ 14 రా.11.36 కు
యోగం: శుక్ల మ.1:47 కు తదుపరి బ్రహ్మ 14 మ.1:12 కు
కరణం: గరజి మ.3.19 కు తదుపరి వణిజ రా 3.36 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:21-9:13 కు, మ. 12:42-1:34 కు
వర్జ్యం: ఉ.7.40-9.21 కు
అమృతకాలం: సా.06:16-07:57 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:30 కు

గురుబోధ:
మనము ఇతరులకు ఎప్పుడైనా ఏదైనా చెప్పవలసి వస్తే వినయముగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. వాళ్లను బాగు చేయడానికి చెప్పాలి తప్ప మనకు తెలిసిందని చెప్పకూడదు. అందుకే ఇతరులకు ఏదైనా చెప్పేటప్పుడు బొంకుతూ చెప్పమన్నారు. సాధ్యమైనంతవరకు మనకు సంపూర్ణముగా తెలియకుండా తిట్టకూడదు. ఒకవేళ మనకు తెలిసినా మార్చడానికి ప్రయత్నించాలి తప్ప తిట్టకూడదు.

expand_less