June 13 2023జూన్ 13 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : దశమి ఉ. 11గం౹౹44ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : రేవతి మ. 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : సౌభాగ్య ఉ. 05గం౹౹55ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  విష్టి ఉ. 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ.08గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రా. 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు 
వర్జ్యం : తె. 04గం౹౹28ని౹౹ నుండి 05గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : మ.01గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు


గురుబోధ
ఫలాపేక్ష లేకుండా ఏదైనా వస్తువును ఇతరులకు ఇవ్వడాన్ని దానము అంటారు. పరమాత్మ ప్రకృతి ద్వారా మనకిస్తున్నదంతా దానమే. ఎవరికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఇస్తుంటాడు. అది ఆయన ధర్మం. యాచించిన వారికి ఏదైనా ఇస్తే దానిని దానమని యాచించకుండా ఇస్తే ధర్మమని ఒక నానుడి లోకంలో ఉంది. జీవకోటి బ్రతకడానికి వర్ధిల్లడానికి సుఖశాంతులతో ఉండడానికి పరమేశ్వరుడు సృష్టికి అందించిన ప్రతి వస్తువు దానమే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేవి ఇతరులకు ఇస్తాయి తప్ప వారి నుండి ఏమీ ఆశించవు. అందుకే వాటిని పంచభూతాలు అన్నారు. 

expand_less