June 12 2026జూన్ 12 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి సా.4.13 కు తదుపరి త్రయోదశి 13 మ.2.03 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి రా.1.51 కు తదుపరి కృత్తిక 13 రా.12.24 కు
యోగం: అతిగండ రా.9:25 కు తదుపరి ధృతి 13 మ.1:15 కు
కరణం: తైతుల రా.7:37 కు తదుపరి వణిజ 13 సా.4:08 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు కు
దుర్ముహూర్తం: ఉ. 8.21 - 9.13 కు, మ. 12.41 - 1.34 కు
వర్జ్యం: మ.12.13 - 1.44 కు
అమృతకాలం: రా. 11.45 - 01.12 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు

🕉️ ప్రదోషం 🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.

గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less