June 12 2025జూన్ 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: జ్యేష్ఠ బహుళ పాడ్యమి మ.3.56 కు తదుపరి విదియ 13 సా.4.09 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మూల రా.9.34 కు తదుపరి పూర్వాషాఢ 13 రా.10.49 కు
యోగం: శుభ మ.2:04 కు తదుపరి శుక్ల 13 మ.1:47 కు
కరణం: కౌలవ మ.2.28 కు తదుపరి తైతుల రా.2.56 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:05-10:57 కు, మ. 3:18-4:10 కు
వర్జ్యం: రా.7.50-9.32 కు
అమృతకాలం: మ.03:09-04:53 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:30 కు

గురుబోధ:
కదంబ వృక్షం కింద కూర్చున్న వాడికి ఎప్పుడూ జపం చేసుకోవాలని, భగవత్ కథలు వినాలని అనిపిస్తుంది. అందుకే పూర్వం కదంబ వృక్షాలను ఇంటిలో పెట్టుకునేవారు. అమ్మవారికి కదంబ వృక్షము అంటే చాలా ఇష్టము. అందుకే అమ్మవారి సహస్రనామాలలో కదంబ కుసుమప్రియ అని ఒక నామం ఉంటుంది. కాళిదాసు వంటి వారు కూడా అమ్మవారిని కదంబ వనవాటికే అని స్తోత్రం చేశారు. కదంబ వృక్షము (కడిమి చెట్టు) మన ఇంటిలో పెరగటం లేదు, చచ్చిపోతోంది అంటే కారణము బయట ఉన్న స్త్రీలు దానిని ముట్టుకున్న లేదా లలితా సహస్రనామం మీద ఆసక్తి లేకపోయినా కదంబ వృక్షం బ్రతకదు. వీలున్నంతవరకు లలితా సహస్రనామమును కదంబ వృక్షం దగ్గర పారాయణం చేయాలి దీనివలన కదంబ వృక్షము బాగా పెరుగుతుంది.

expand_less