" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 12 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : నవమి మ. 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి దశమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర సా. 04గం౹౹56ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : ఆయుష్మాన్ ఉ. 07గం౹౹53ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : గరజి ఉ. 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మ. 03గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹54ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹26ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు అమృతకాలం : మ.12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹29ని౹౹కు https://www.youtube.com/live/683xWjrxp6w?feature=share&t=1105 గురుబోధ 1. అక్షమాల (స్ఫటిక జపమాల) ; 2. పరశువు (గండ్ర గొడ్డలి) ; 3. గద ; 4. బాణం ; 5. వజ్రాయుధం ; 6. తామరపువ్వు ; 7 విల్లు ; 8. జల కమండలం ; 9. యోగ దండం ; 10. శక్తి (ఈటె) ; 11. ఖడ్గం ; 12. డాలు ; 13. శంఖం ; 14. ఘంట ; 15. మధుపాత్ర ; 16. శూలం ; 17. పాశం ; 18. సుదర్శన చక్రం వంటి పద్దెనిమిది ఆయుధాలను ధరించి మహాలక్ష్మీరూపంలో అష్టభుజములతో మహిషాసురుని వధించడానికి అమ్మవారు ఆవిర్భవించింది. తెల్లవారే లేచి ఈ ఆయుధాలను తలచుకుంటే చాలు ఆనాటి వరకు చేసిన క్రూరమైన కఠోరమైన పాపములు తొలగిపోతాయి. ఆ ఆయుధములే మనల్ని రక్షిస్తాయి అని జగన్మాత స్వయంగా చెప్పింది. - సంపూర్ణ శ్రీ మార్కండేయ పురాణం