"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 12 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : త్రయోదశి ఈ రోజు రాత్రి 10గం౹౹08ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : విశాఖ ఈ రోజు రాత్రి 10గం౹౹16ని౹౹ వరకు తదుపరి అనురాధ
యోగం : శివ ఈ రోజు సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం : కౌలవ మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹46ని౹౹ నుండి 05గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 04గం౹౹45ని౹౹ నుండి 06గం౹౹12ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹22ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని౹౹ వరకు
గురుబోధ:
గోమాత ప్రత్యక్షదైవం. గోసేవ, గోపోషణ వల్ల వంశాలు తరిస్తాయి. గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల వచ్చే దోషాలను, వాస్తు దోషాలు, ఇతర కష్టములను తొలగిస్తుంది. దిలీప మహారాజు ఒక సంవత్సరం పాటు చేసిన గోసేవ వల్ల రఘు మహారాజును పుత్రునిగా పొందాడు. ఆ వంశం రఘువంశం అయింది.