కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి సా. 5.48 కు తదుపరి షష్ఠి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆశ్లేష రా. 12.24 కు తదుపరి మఘ
యోగం: వ్యాఘాత సా. 04.47 కు తదుపరి హర్షణ
కరణం: బాలవ సా. 05.27 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.19 - 09.12 కు & రా. 11.11 - 11.54 కు
వర్జ్యం: మ. 12.26 - 2.06 కు
అమృతకాలం: రా. 10.33 - 12.15 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.51 కు
గురుబోధ:
జ్యేష్ఠ శుక్లపంచమి - కొందరికి ఎంత ప్రయత్నించినా వివాహం జరగదు. పెళ్ళి అయినా సంతానం ఉండదు. ఇటువంటి వారు ఈ తిథినాడు పితృదేవతలను పూజిస్తే వివాహం జరుగుతుంది. పండితులైన పుత్రపుత్రికలు జన్మిస్తారు.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=JrfFL1JYuFxc0i0F