June 11 2023జూన్ 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : అష్టమి మ. 03గం౹౹37ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర సా. 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : ప్రీతి ఉ. 10గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  కౌలవ మ. 12గం౹౹05ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹46ని౹౹ నుండి 05గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹48ని౹౹ వరకు
అమృతకాలం : ఉ.10గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹29ని౹౹కు

https://www.youtube.com/watch?v=UU-47lmiQm4&list=PLfgDt5ZsV1JKYwdGvE4Hb_wORJB8vCeg-

గురుబోధ
బుధవారం ,అష్టమి, ఆదివారం ఇవి కాలభైరవునికి చాలా ప్రీతి. అందుకే ఆదివారం అష్టమీతిథి కలసి వస్తే అది మరింత శ్రేష్ఠం. కాలభైరవుని అర్చించి, యథాశక్తి దక్షిణలు ఇచ్చి భక్తిశ్రద్ధలతో గురువులను మనస్సులో తలచుకుంటే సకల శుభాలు పొందుతాము. గురుకటాక్షం, కాలభైరవుని విశేష అనుగ్రహం కలుగుతుంది. దానంతో సమానమైన పుణ్యం మరొకటిలేదు. మహాపాతకాలన్నీ దానంవల్ల తొలగిపోతాయి. పూజలన్నిటికి పరమార్ధం దానం చేయడమే. భగవంతుడికి మనం ఇచ్చే ప్రతి పైసా తిరిగి వెనక్కి వస్తూనే ఉంటుంది. 


expand_less