"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 11 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : ద్వాదశి ఈ రోజు రాత్రి 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : స్వాతి ఈ రోజు రాత్రి 11గం౹౹20ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : పరిఘ ఈ రోజు రాత్రి 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి శివ
కరణం : బవ సాయంత్రం 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 05గం౹౹29ని౹౹ నుండి 07గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹47ని౹౹ నుండి 04గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని౹౹ వరకు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.
👉🏻🕉️రామ లక్ష్మణ ద్వాదశి🕉️
గురుబోధ:
ఈ రోజు రామాష్టకం/ సంక్షిప్త రామాయణం/ సీతారామకల్యాణ /పట్టాభిషేకం ఘట్టాలు, హనుమాన్ చాలీసాలో ఏదో ఒక స్త్రోత్రం, భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం వలన అనేక శుభ ఫలితములు పొందుతారు.