June 10 2023జూన్ 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : సప్తమి సా. 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : శతభిషం రా. 07గం౹౹38ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : విష్కంభ మ. 12గం౹౹49ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం :  బవ మ. 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹29ని౹౹కు


గురుబోధ

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ | 
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ||

https://youtu.be/LPowEdlV2sw

కలిపురుషుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరినైనా పట్టుకుంటాడు. కలిపురుషుని ప్రభావానికి లోను కాకుండా ఎవరూ ఉండరు. ఈ కలియుగంలో కలిగే కష్టాలన్నీ కలిప్రభావం చేతనే కలుగుతాయి. ఈ కలిప్రభావం మననుండి తొలగిపోవాలన్నా, కలిప్రభావం పడకుండా ఉండడానికి వేదవ్యాసులవారు బృహదశ్వుని ద్వారా అపూర్వమైన శ్లోకాన్ని అందించారు. ఈ శ్లోకాన్ని ఉదయం లేవగానే చదువుకుంటే కలి నుండి విముక్తులవుతాము.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less