June 09 2026జూన్ 09 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి రా.9.02 కు తదుపరి దశమి 10 రా.7.47 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర 10 తె.4.44 కు తదుపరి రేవతి 11 తె.4.06 కు
యోగం: ఆయుష్మాన్ ఉ.6:29 కు తదుపరి సౌభాగ్య 10 తె.4:02 కు
కరణం: తైతుల మ.3:05 కు తదుపరి వణిజ 10 మ.1:52 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.21 - 9.13 కు, రా. 11.09 - 11.53 కు
వర్జ్యం: మ.2.28 - 4.03 కు
అమృతకాలం: తె. 04.35 - 06.10 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు

గురుబోధ:
🕉️ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఏటి సూతకం కేవలం చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలకు మాత్రం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క మనవళ్ళకు, అన్నదమ్ములకు, సగోత్రికులకు ఉండదు. మనవళ్లకు, సగోత్రికులకు వారి ఆచారము బట్టి 10 లేదా 15 రోజులలో మైల తీరిపోతుంది. వారు శుభకార్యాలు చేసుకోవచ్చు.
- శ్రీ గరుడపురాణం (ధర్మకాండము)
🕉️ఏటి సూతకం ఉన్నవారు తీర్థ యాత్రలు, నిత్య పూజలు, ఆలయ దర్శనం చేసుకోవచ్చు. కేవలం ప్రత్యేక పూజలు తమ గోత్ర నామాలతో చేసుకోరాదు. - శ్రీ గరుడపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less