కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: తదియ సా. 4.22 కు తదుపరి చతుర్థి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పునర్వసు రా. 9.26 కు తదుపరి పుష్యమి
యోగం: వృద్ధి సా. 05.21 కు తదుపరి ధ్రువ
కరణం: గరజి మ. 03.44 కు తదుపరి వణిజ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 05.05 - 05.57 కు
వర్జ్యం: ఉ. 9.03 - 10.42 కు
అమృతకాలం: సా. 6.48 - 8.26 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
సాయంసంధ్యాసమయంలో ఇంటి ఆవరణ మఱియు గదులలో చీకటి ఉండకుండా చూసుకోవాలి. పూజామందిరం లో తప్పక దీపం వెలిగించాలి. గదులలో విద్యుత్ దీపములు( లైట్స్) వెలిగించవచ్చు.