June 09 2023జూన్ 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 9 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : షష్ఠి రా. 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ధనిష్ఠ రా. 09గం౹౹16ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : వైధృతి మ. 03గం౹౹46ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం :  వణిజ సా. 04గం౹౹20ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹58ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹29ని౹౹కు

https://youtube.com/clip/UgkxLVOEFlWR5nq9mhRUS4Gz3eMSg7VTisF7

గురుబోధ

పక్షౌ తే మారుతః పాతు చంద్ర సూర్యౌ చ పృష్ఠతః | 
శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుమ్ ||

దీనికి ఋగ్వేద మంత్రము అని పేరు. ఈ మంత్రాన్ని వినత నిత్యం చదివేది, అందుకే ఆమె కొడుకులెప్పుడూ అపజయంపాలు కాకుండా విజయం పొందారు. గరుత్మంతునికి రక్ష కోసం వినత చెప్పిన మాటలు. నీ రెక్కల్ని వాయుదేవుడు కాపాడు గాక, సూర్యచంద్రులు నీ వీపును రక్షించుగాక, అగ్నిదేవుడు నీ శిరస్సును కాపాడుగాక, అష్టవసువులు నీ శరీరమంతటిని రక్షించుగాక. ప్రయాణంలో ప్రమాదం రాకుండా ఉండడానికి ఈ శ్లోకం వేదవ్యాసులవారు వినత ద్వారా అందించారు. ఈ శ్లోకానికి గొప్ప శక్తి ఉంది. తనకోసం తాను ఈ శ్లోకం పఠిస్తే ఉపయోగపడడం కన్నా ఇతరులకు కోసం పఠిస్తే ఉపయోగపడుతుంది. ఎదుటి వారి చేతులను స్పృశిస్తూ భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ, తల్లి పిల్లలకు కానీ, ఇలా ఇతరుల కోసం ఈ శ్లోకం చదవాలి. పఠించినవారి ద్వారా ఇతరులకు రక్షణ కలిగించే అపూర్వస్తోత్రం ఇది.

expand_less