"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 9 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము తిథి : దశమి ఈ రోజు రాత్రి 02గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : హస్త ఈ రోజు రాత్రి 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి చిత్ర యోగం : వ్యతీపాత ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹01ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹41ని౹౹ నుండి10గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు సాయంత్రం 06గం౹౹21ని౹౹ నుండి 07గం౹౹57౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹29ని౹౹ వరకు 👉🏻🕉️దశపాపహర దశమి🕉️ గురుబోధ: ఈ రోజు గంగాస్నానం, ఆపకుండా గోవింద నామస్మరణ చెయ్యడం చాలా శ్రేష్ఠం. కాశీకి వెళ్లే అవకాశం లేని వాళ్లు ఉన్నచోటనే ఎవరి ఇంట్లో వాళ్లు, ఎవరికి వాళ్లు స్నానం ఆచరించినప్పుడు, నీళ్ళలో చేతిని త్రిప్పుతూ గంగ, గంగ, గంగ అని మూడుసార్లు భక్తితో సంకల్పం చేసుకొని స్నానం ఆచరించాలి. తలచుకున్న మాత్రమునే పాపములను హరించే శక్తి గంగకి ఉంటుంది. అందువలన గంగని ఆహ్వానించి స్నానం ఆచరించితే గంగాస్నాన ఫలితం ఉంటుంది.