కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా.9.51 కు తదుపరి నవమి 9 రా.9.02 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర 9 తె.4.57 కు తదుపరి ఉత్తరాభాద్ర 10 తె.4.44 కు
యోగం: ప్రీతి ఉ.8:18 కు తదుపరి ఆయుష్మాన్ 9 ఉ.6:29 కు
కరణం: బాలవ మ.3:30 కు తదుపరి తైతుల 9 మ.3:05 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.41 - 1.33 కు, మ. 3.17 - 4.09 కు
వర్జ్యం: ప.11.10 - 12.47 కు
అమృతకాలం: రా. 01.28 - 03.06 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు
గురుబోధ:
అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. సోమవారంతో పాటు వచ్చిన అష్టమి మరింత విశేషఫలితాలనిస్తుంది. శివపార్వతుల అర్చన, అభిషేకం అనంతశుభాలను ప్రసాదిస్తుంది. ఇటువంటి దివ్యసమయాన్ని అలభ్యయోగమని అంటారు. అంత సులువుగా లభించని ఈ రోజును భవానీశంకరులసేవతో సద్వినియోగపరచుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం, పుణ్యప్రదం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial