June 08 2025జూన్ 08 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 08 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి ఉ.8.46 కు తదుపరి త్రయోదశి 9 ఉ.10.38 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: స్వాతి మ.12.40 కు తదుపరి విశాఖ 9 మ.3.16 కు
యోగం: పరిఘ సా.12:17 కు తదుపరి శివ 9 సా.1:08 కు
కరణం: బాలవ ఉ.7.18 కు తదుపరి కౌలవ రా.8.29 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:01-5:53 కు
వర్జ్యం: రా.6.52-8.3 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు

🕉️ జ్యేష్ఠ శుక్ల త్రయోదశి 🕉️

గురుబోధ:
శ్లో. అదాన దోషేణ భవేత్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపమ్
పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపీ
దానం చేయని దోషం వల్ల మానవుడు దరిద్రుడై జన్మిస్తాడు. ఈనాటి మన దారిద్ర్యానికి మూలకారణం ఏనాడూ ఎవరికీ దానం చేయకపోవడమే. దరిద్రత వల్ల బ్రతకడానికి ఏదో ఒక పాపం చెయ్యక తప్పదు. పాపం వల్లఈ నరకం తప్పదు. నరకం నుండి తిరిగి భూలోకంలో దరిద్రుడిగా పుడతాడు జీవి. మరల పాపపు బ్రతుకు తప్పదు. ఈ చక్రం నుండి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావలసిందే. జ్యేష్ఠ మాసం లోని శుక్ల త్రయోదశీ తిథిని దౌర్భాగ్యశమనతిథి అంటారు. ఈ రోజు ఏదైనా నదిలో కాని, ప్రవాహ జలంలో కాని స్నానం చేసి తెల్లమందారం, జిల్లేడు, ఎఱ్ఱగన్నేరు పూలను ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆపై సూర్యుని కేసి చూస్తూ పూలను తాకి నమస్కరించాలి. ఈ క్రింది శ్లోకం పఠించాలి.
శ్లో. మందార కరవీరార్కః భవంతో భాస్కరాంశజాః
పూజితా మమదౌర్భాగ్యం, నాశయంతు నమోస్తువః
"మందారమా! గన్నేరుపూవా! జిల్లేడుపూవా! మీరు సూర్యుని అంశతో జన్మించారు. మా పూజలందుకొని మా దౌర్భాగ్యం తొలగించండి. మీకు నమస్కారం" అని ఈ శ్లోకానికి అర్థం. ఇలా పూజించిన వారి దౌర్భాగ్యాలన్నీ తొలగిపోతాయి. సంపదలు, మనీషాసంపదలు లభిస్తాయి. మనం చేసే దానధర్మములు, పురాణశ్రవణము, తీర్థయాత్రాఫలితాలు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.

expand_less