June 08 2023జూన్ 08 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 8 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి రా. 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : శ్రవణం రా. 10గం౹౹57ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : ఐంద్ర సా. 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  కౌలవ ఉ. 08గం౹౹23ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 03గం౹౹01ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹48ని౹౹ వరకు & రా. 02గం౹౹40ని౹౹ నుండి 04గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹15ని౹౹ నుండి 02గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹29ని౹౹కు


గురుబోధ
మనం అనుకున్న పనులు పూర్తి కావాలంటే మనశ్శాంతి లభించాలంటే ఈశ్వరునికి, గౌరికి, కుమార స్వామికి , విష్ణువునకు, బ్రహ్మకు, ఇంద్రునికి, యమునికి, దిక్పాలురకు జల తర్పణాలు (రెండు చేతులతో నీరు తీసుకుని ఈశ్వరం తర్పయామి, గౌరీం తర్పయామి ఇలా పలుకుతూనే నీళ్ళు విడిచి పెట్టడాన్ని జలతర్పణం అంటారు) ఇవ్వాలి. చివరన బ్రహ్మార్పణం అనాలి. - శ్రీ శివమహాపురాణం

expand_less