June 07 2024జూన్ 07 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: పాడ్యమి సా. 4.58 కు తదుపరి విదియ
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మృగశిర రా. 8.24 కు తదుపరి ఆర్ద్ర
యోగం: శూల రా. 08.05 కు తదుపరి గండ
కరణం: బవ మ. 04.44 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.19 - 09.11 కు & మ. 12.41 - 01.34 కు
వర్జ్యం: తె. 3.23 - 4.53 కు
అమృతకాలం: ఉ. 11.31 - 1.07 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

గురుబోధ
శ్లో|| కరవీర! వృషావాస! నమస్తే భానువల్లభ!
      దంభోళి మృడ దుర్గాది దేవానాం సతతం ప్రియం!
జ్యేష్ఠ శుక్లపాడ్యమినాడు దేవాలయ సంబంధమైన ప్రాంతంలో పూచిన గన్నేరు పువ్వును గంధం, కుంకుమ జల్లి భక్తితో నమస్కరించి ఈ పై శ్లోకం చదువుకోవాలి. ఇలా పలికి, ఆ పుష్పాన్ని ఆ ప్రాంగణమునకు చెందిన అర్చకులకు లేక పురోహితులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైన ఆధ్యాత్మికజ్ఞానం, జ్ఞాపకశక్తి లభిస్తాయి.

expand_less