June 07 2023జూన్ 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 7 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి రా. 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా. 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : బ్రహ్మ రా. 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  బవ ఉ. 11గం౹౹19ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹33ని౹౹ నుండి 11గం౹౹03ని౹౹ వరకు & తె. 04గం౹౹19ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹34ని౹౹ నుండి 08గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు

🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ
ప్రతిమాసంలో కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థిగా వ్యవహరిస్తారు. ఈ వ్రతాన్ని నెలలో ఉండే రెండు పక్షాలలోనూ చేసుకోవచ్చు. కానీ కృష్ణపక్షంలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో చతుర్థి ఉంటే ఇంకా చాలా మంచిది. చంద్రోదయ సమయానికి చతుర్థీతిథి ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్రతాన్ని శమీ(జమ్మి)వృక్షం వద్ద చేస్తే ఎక్కువగా ఫలిస్తుంది. ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ శ్రావణ మాసంలో ప్రారంభిస్తే మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించే వారు విఘ్నేశ్వరుని ప్రతిమను పెట్టుకుని షోడశోపచారాలతో పూజించాలి. సాయంత్రం చంద్రోదయ సమయంలో పూజించాలి. జ్యేష్ఠమాసంలో అన్నం మీద బాగా నెయ్యి పోసిన అన్నాన్ని నివేదన చేయాలి. నివేదించిన పదార్థాలను తాను కొంత ప్రసాదంగా తిని, అందరికీ పంచిపెట్టాలి. ఇలా పన్నెండు మాసాలు కృష్ణపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సంకష్టహర చతుర్థీవ్రతం పూర్తవుతుంది. జీవితంలో అనేక సమస్యలతో బాధపడేవారు, వ్యాపారం లో ఇబ్బందులు ఉన్నవారు  ఈ సంకష్టహర చతుర్థీ వ్రత్రం ఆచరించడం వలన  మహాపాపాలు పోతాయి. - శ్రీ గణేశపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less