June 06 2024జూన్ 06 2023favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య సా. 5.58 కు తదుపరి పాడ్యమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: రోహిణి రా. 8.35 కు తదుపరి మృగశిర
యోగం: ధృతి రా. 10.09 కు తదుపరి శూల
కరణం: చతుష్పాద తె. 06.58 కు తదుపరి నాగ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.56 కు & మ. 03.19 - 04.11 కు
వర్జ్యం: మ. 12.46 - 2.19 కు & రా. 2.08 - 3.43 కు
అమృతకాలం: సా. 5.18 - 6.51 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

🕉️శనైశ్చర జన్మతిథి, హనుమంతుడు బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి వరము పొందిన రోజు🕉️

దశరథకృత శని స్తోత్రం
https://youtu.be/41P8HbBhQAs?si=lpnkbWN2qJM9T2dE
https://srivaddipartipadmakar.org/stotram/shani-stotram-by-dasaratha-padma-purana/

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
https://youtu.be/97Q4_4k_hH4?si=7WjAgs04OkTKwVjm

గురుబోధ
పూర్వం సూర్య భగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖ మాసం అమావాస్య నాడు జన్మించాడు అందుకే వైశాఖ అమావాస్య శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడం. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని (శనైశ్చరుడుకి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చొని) అనగా కోణంలో కూర్చోవాలి.
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం || అనే శ్లోకాన్ని చదువుకోవాలి.
వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు, బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి అనేక వరములు పొందాడు కాబట్టి ఏదైనా హనుమంతుని స్తోత్రము చదువుకొని, కథ వినాలి.

expand_less