కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రా. 9.09 కు తదుపరి చతుర్దశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: భరణి రా. 10.10 కు తదుపరి కృత్తిక
యోగం: శోభన తె. 06.12 కు తదుపరి అతిగండ
కరణం: గరజి ఉ. 11.08 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.18 - 09.11 కు & రా. 11.09 - 11.53 కు
వర్జ్యం: ఉ. 8.31 - 10.02 కు
అమృతకాలం: సా. 5.32 - 7.03 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు
గురుబోధ:
పురాణ శ్రవణము, యాత్రా ఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.