June 04 2023జూన్ 04 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 4 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ ఉ. 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : అనూరాధ తె. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ 5వ తేదీ తె. 04గం౹౹38ని౹౹ వరకు
యోగం : సిద్ధ ఉ. 11గం౹౹59ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  బవ ఉ. 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹44ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹44ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹04ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు

🕉️జ్యేష్ఠ పూర్ణిమ🕉️

గురుబోధ
ఈ తిథిని వటసావిత్రీ తిథి అని అంటారు. ఈ తిథి చాలా గొప్పది, పుణ్య తిథి. కాశీలో వటసావిత్రి అని ఒక దేవత, యమరాజేశ్వరలింగానికి దగ్గరలో ఉన్నది. ఈ రోజున ఆ దేవతకి పూజ చేస్తారు. కాశీలో యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన లింగం యమరాజేశ్వరలింగం అని పిలవబడుతున్నది. ఈ రోజున మన ఇంట్లో మఱ్ఱి చెట్టు కింద కానీ, లేక మఱ్ఱి ఆకు మీద కానీ, ఈ వటసావిత్రీదేవిని కానీ గాయత్రీదేవిని కానీ పెట్టుకుని పూజ చేయాలి. పూజ చెయ్యలేకపోయినా త్రికాలాలలో అనగా ఉదయం 6 గం.లకు, మధ్యాహ్నం 12 గం.లకు, సాయంత్రం 6 గం.లకు చేతిలోకి నీళ్ళు తీసుకుని తర్పణాలు వదలాలి. అలా వదిలేటప్పుడు “ ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి” అని వదిలిపెడితే అనంతపుణ్యం లభిస్తుంది.

జ్యేష్ఠ మాసము పూర్ణిమ సందర్భంగా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దివ్యాశీర్వచనం, అనుగ్రహంతో లోకకల్యాణార్థం భాగ్యనగరం లోని శ్రీ ప్రణవపీఠ అరుణాచలేశ్వరునికి రుద్రాభిషేకము మఱియు సత్యనారాయణస్వామి వ్రతం సా.4 గం.ల నుండి 7 గం. ల వరకు నిర్వహించబడుతాయి.

expand_less