June 02 2026జూన్ 02 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ సా.4.52 కు తదుపరి తదియ 03 సా.6.43 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మూల రా.8.31 కు తదుపరి పూర్వాషాఢ 03 రా.10.56 కు
యోగం: శుభ ఉ.8:11 కు తదుపరి శుక్ల 03 ఉ.9:02 కు
కరణం: గరజి రా.7:01 కు తదుపరి విష్టి 03 రా.9:21 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.20 - 9.12 కు, రా. 11.07 - 11.52 కు
వర్జ్యం: సా.6.45 - 8.31 కు
అమృతకాలం: మ. 02.59 - 04.47 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు

🕉️ యమునానదీ పుష్కరాలు ఆరంభం - జూన్ 2 నుండి జూన్ 13 వరకు🕉️

గురుబోధ:
🕉️గురుగ్రహం సంవత్సరమునకు ఒక సారి 12 రాశులలోకి, ఒక రాశి, నుండి మరియొక రాశిలోనికి మారినప్పుడల్లా, భారత దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరములు ఏర్పడతాయి. గురుడు కర్కాటకరాశి లో ప్రవేశించినప్పుడు యమునానదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో, ఆ నది సకల తీర్థాలను తనలో నింపుకొంటుంది. అందువల్లే పుష్కర కాలంలో నదులకు మహా మహిమలు కలుగుతాయి.
🕉️పుష్కర కాలంలో యమునా నదిలో స్నానం అనంత పుణ్యం ఇస్తుంది. యమునా నదీ తీరంలో చేసే భూదాన, గోదాన, వస్త్ర దానాలు శాశ్వతముగా గోలోక సుఖాలను అందిస్తాయి. యమునా కవచం గర్గ భాగవతంలో ఉంది. దానిని యమునా నదీ తీరంలో చదివితే శ్రీకృష్ణుని సన్నిధి లభిస్తుంది. ఆ గర్గ సంహితలోనే యమునా సహస్ర నామాలు కూడా ఉన్నాయి. అవి పుష్కర కాలంలో చదివితే వచ్చే ఫలితం ఆదిశేషుడు కూడా వర్ణించలేడు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less