June 02 2023జూన్ 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 2 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : త్రయోదశి ఉ. 10గం౹౹58ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : విశాఖ 3వ తేదీ ఉ. 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : పరిఘ సా. 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  తైతుల మ. 12గం౹౹48ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & మ. 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹04ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹40ని౹౹ నుండి 10గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹27ని౹౹కు

🕉️నమ్మాళ్వార్ తిరునక్షత్రం, కంచి గరుడ ఉత్సవం,  జ్యేష్ఠ శుక్ల త్రయోదశి🕉️


గురుబోధ
శ్లో|| అదాన దోషేణ భవేత్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపమ్|
పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపీ||
దానం చేయని దోషం వల్ల మానవుడు దరిద్రుడై జన్మిస్తాడు. ఈనాటి మన దారిద్ర్యానికి మూలకారణం ఏనాడూ ఎవరికీ దానం చేయకపోవడమే. దరిద్రత వల్ల బ్రతకడానికి ఏదో ఒక పాపం చెయ్యక తప్పదు. పాపం వల్లఈ నరకం తప్పదు. నరకం నుండి తిరిగి భూలోకంలో దరిద్రుడిగా పుడతాడు జీవి. మరల పాపపు బ్రతుకు తప్పదు. ఈ చక్రం నుండి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావలసిందే. జ్యేష్ఠమాసంలోని శుక్ల త్రయోదశీ తిథిని దౌర్భాగ్యశమనతిథి అంటారు. ఈ రోజు ఏదైనా నదిలో కాని, ప్రవాహ జలంలో కాని స్నానం చేసి తెల్లమందారం, జిల్లేడు, ఎఱ్ఱగన్నేరు పూలను ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆపై సూర్యుని కేసి చూస్తూ పూలను తాకి నమస్కరించాలి. ఈ క్రింది శ్లోకం పఠించాలి.
శ్లో|| మందార కరవీరార్కః భవంతో భాస్కరాంశజాః|7
పూజితా మమదౌర్భాగ్యం, నాశయంతు నమోస్తువః||
"మందారమా! గన్నేరుపూవా! జిల్లేడుపూవా! మీరు సూర్యుని అంశతో జన్మించారు. మా పూజలందుకొని మా దౌర్భాగ్యం తొలగించండి. మీకు నమస్కారం" అని ఈ శ్లోకానికి అర్థం. ఇలా పూజించిన వారి దౌర్భాగ్యాలన్నీ తొలగిపోతాయి. సంపదలు, మనీషాసంపదలు లభిస్తాయి. మనం చేసే దానధర్మములు, పురాణశ్రవణము, తీర్థయాత్రాఫలితం మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి. 

expand_less