"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 2 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము తిథి : తదియ రాత్రి 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఆర్ద్ర మధ్యాహ్నం 01గం౹౹49ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : గండ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : తైతుల ఈ రోజు ఉదయం 11గం౹౹02ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ & మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు తెల్లవారి 03గం౹౹06ని౹౹ నుండి 04గం౹౹52ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹27ని౹౹ వరకు గురుబోధ: ఉల్లి, వెల్లుల్లి మొదలగు పదార్థాలలో గొప్ప ఔషధగుణములు ఉంటాయి. కానీ అవి స్వీకరించడం వల్ల మనస్సు రజోగుణమును (అస్థిరత్వం , చంచల మనస్సు , ఏకాగ్రత కోల్పోవడం) పొందుతుంది. ఔషధం ప్రతిరోజూ స్వీకరించడం శరీరానికి మంచిది కాదు. అందుకే వీటిని కూడా ప్రతిరోజూ వంటలో వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే పెద్దలు ఆదివారం, శనివారం, మంగళవారం, పర్వదినములు, పండుగలు మొ౹౹ రోజులలో వీటిని వంటలో వాడేవారు కాదు.