June 01 2024జూన్ 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 01 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి తె. 3.53 కు తదుపరి దశమి 02 తె. 3.53 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 2.30 కు తదుపరి రేవతి
యోగం: ప్రీతి మ. 03.10 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: గరజి ఉ. 07.24 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.41 - 07.26 కు
వర్జ్యం: మ. 1.06 - 2.35 కు
అమృతకాలం: రా. 10.00 - 11.29 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు

👉🕉️ వైశాఖ కృష్ణపక్ష దశమి - హనుమ జన్మతిథి 🕉️👈

గురుబోధ:
ఈ రోజున భక్తులు చెయ్యవలసినవి:
🕉️హనుమంతుడి ప్రతిమకు లేదా పటముకు యథాశక్తి తమలపాకులతో అర్చన.
🕉️ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయనమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః వంటి అష్టోత్తర శతనామములతో పూజ.
🕉️మన్యుసూక్తంతో హనుమంతుడికి అభిషేకం.
🕉️ఓం హరిమర్కటమర్కటాయ నమః అనేది హనుమంతుని ద్వాదశాక్షరమంత్రము. ఈ పరమపవిత్రమైన మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో జపం.
🕉️రాముడి నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. శ్రీరామ జయరామ జయజయ రామ అని రామ నామము చేయడం.
🕉️హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణ చేస్తే, వాడు జైలు నుండి కూడా బయటకు వస్తాడు, మహాసుఖం పొందుతాడు, వాడికి శివుడి సాక్షిగా సిద్ధి కలుగుతుంది.
🕉️అప్పాలు నివేదన
ఇవన్నీ భక్తిశ్రద్ధలతో చేసుకున్న వారికి సీతారామాంజనేయ అనుగ్రహం, అనేక శుభాలు కలుగుతాయి.

ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం👇
https://youtu.be/KCvspNFxw4o?si=d3gXQWSMfQb3OmG6
PDF👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-anjaneya-ashtottara-satanamamulu

expand_less