June 01 2023జూన్ 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 1 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి ఉ. 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : స్వాతి పూర్తిగా ఉంది తదుపరి విశాఖ
యోగం : వరీయాన్ రా. 07గం౹౹00ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం :  బాలవ మ. 01గం౹౹39ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 03గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹26ని౹౹ నుండి 10గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹27ని౹౹కు

🕉️జ్యేష్ఠ శుక్ల ద్వాదశి (రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకరుల కైలాస గమనం)🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు ఉదయం 11 గం.ల లోపు చెయ్యాలి.

గురుబోధ
జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో నిర్జల ఏకాదశి తరువాత రోజు అనగా ద్వాదశీ తిథిని రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఒక్క పండు అయినా తగిన దక్షిణతో దానం చేయాలి. భక్తి శ్రద్ధలతో “రామలక్ష్మణ అర్పణమస్తు, రామలక్ష్మణ అర్పణమస్తు, రామలక్ష్మణ అర్పణమస్తు” అంటూ దానం చేయాలి. అది రామలక్ష్మణులకి చేరుతుంది. వారు స్వయంగా స్వీకరిస్తారు. దాని వలన మనకి ఉన్న సమస్త పాపాలు తొలగిపోయి జీవితం అంతా సఫలం అవుతుంది, సర్వశుభాలు కలుగుతాయి అని రాములవారు వివరించారు. రామలక్ష్మణులు తమ అవతారపరిసమాప్తి వరకు ప్రతి జ్యేష్ఠశుక్లపక్ష ద్వాదశి రోజు దానం చేసారు. అందువలన ఈ తిథిని రామలక్ష్మణ ద్వాదశీ తిథి అని అంటారు. షణ్మత స్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాస గమనం చేసిన రోజు కూడా ఇదే కావడం వలన వారి స్మరణ, పూజాదులు గురు అనుగ్రహాన్ని కలుగజేస్తాయి.

https://youtu.be/lb-Cfa7YoEQ
https://youtu.be/YlxIZosSc7Q

expand_less