July 8 2023జులై 8 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 8 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి ఉ. 05గం౹౹43ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి. 02గం౹౹25ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సౌభాగ్య సా. 05గం౹౹23ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  గరజి ఉ. 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹25ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹58ని౹౹ నుండి 08గం౹౹25ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹34ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు


గురుబోధ 
ఇంటిలో శివలింగం, సాలిగ్రామము ఉంచి పూజించవచ్చు. స్త్రీ, పురుష, జాతి, వర్ణ భేదం లేదు. అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు  వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది. పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు.


expand_less