July 7 2023జులై 7 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 7 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ధనిష్ఠ ఉ. 05గం౹౹41ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : ఆయుష్మాన్ రా. 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  కౌలవ మ. 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹09ని౹౹ నుండి 09గం౹౹01ని౹౹ వరకు & మ. 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹15ని౹౹ నుండి 10గం౹౹44ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹34ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు


గురుబోధ 
ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవి పూజ, జపము చాలా విశేషము. మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన  ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల) లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలా గా ఆరాధించడం.

expand_less