July 5 2023జులై 5 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 5 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : విదియ మ. 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ. 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : వైధృతి ఉ. 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం :  గరజి ఉ. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹42ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹38ని౹౹ నుండి 11గం౹౹08ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు

గురుబోధ 
వ్యాసానుగ్రహం లేనిదే అష్టాదశ పురాణములు సంపూర్ణంగా శ్రవణం చేసే భాగ్యం అందరికీ కలగదు. పురాణములు పండితులకు, భక్తులకు దానం ఇవ్వడము, పిల్లల చేత ఇప్పించడం ఎంతో పుణ్యము. అక్షరాభ్యాసం నాడు తప్పక పిల్లలచేత పురాణములు, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పించాలి. పురాణ గ్రంథములను భక్తితో పూజించినా ఆ పురాణ అధిష్ఠాన దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు.

expand_less