కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 31 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ రా.9.14 కు తదుపరి బ.తదియ 01 రా.9.27 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.7.20 కు తదుపరి శతభిషం 01 రా.8.17 కు
యోగం: సౌభాగ్య రా.11:53 కు తదుపరి అతిగండ 01 రా.10:29 కు
కరణం: గరజి రా.10:32 కు తదుపరి విష్టి 01 రా.11:07 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 - 9.23 కు, మ. 12.48 - 1.39 కు
వర్జ్యం: రా.2.49 - 4.29 కు
అమృతకాలం: ఉ. 08.17 - 10.00 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు
🕉️ ఆషాఢ శుక్రవారము 🕉️
గురుబోధ:
ప్రతిరోజూ ఏదో ఒక మంచి పనిచేయకుండా సమయాన్ని వ్యర్థంగా వెళ్లబుచ్చరాదు, నిద్రించరాదు. అంటే మంచి పుస్తకాలు, పురాణములు చదవడం, పారాయణం చేయడం, జపం చేయడం, ఆలయమునకు వెళ్లడం, ఇతరులకు సహాయం చేయడం, అన్నదానం, మంచి విషయాలు చర్చించడము, పెద్దలకు సేవ చేయడం మొ౹౹ ఏవో ఒకటి చేయాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial