July 31 2024జులై 31 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 31 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా. 5.23 కు తదుపరి ద్వాదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రోహిణి మ. 12.37 కు తదుపరి మృగశిర
యోగం: ధ్రువ మ. 02.14 కు తదుపరి వ్యాఘాత
కరణం: బాలవ మ. 03.55 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.57 - 12.48 కు
వర్జ్యం: తె. 3.55 - 6.25 కు & సా. 6.07 - 7.42 కు
అమృతకాలం: ఉ. 9.31 - 11.03 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు

👉🕉️ ఆషాఢ బహుళ ఏకాదశి 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు (బుధవారం) ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (గురువారం ఉదయం) చేయాలి.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

గురుబోధ:
ఆషాఢ బహుళైకాదశిని యోగినీతిథి అని పిలుస్తారు. ఈ తిథి నాడు శివకేశవులను అర్చించిన వారు యోగశక్తి పొందుతారు. ఈ తిథినాడు చేసే ఉపవాసం వల్లా, శ్రీహరి పూజ వల్లా, సకల రోగాలు తొలగి, ఆనందమయ జీవితం లభిస్తుంది.
expand_less