కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి రా. 6.53 కు తదుపరి ఏకాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: కృత్తిక మ. 1.25 కు తదుపరి రోహిణి
యోగం: వృద్ధి మ. 03.56 కు తదుపరి ధ్రువ
కరణం: విష్టి మ. 04.44 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.22 కు & రా. 11.16 - 12.00 కు
వర్జ్యం: తె. 4.52 - 6.22 కు
అమృతకాలం: ఉ. 11.06 - 12.37 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
80 జన్మల సంస్కారం, పుణ్య ఫలం ఉంటే గాని ఒక్క పురాణం సంపూర్ణంగా వినే అదృష్టం కలుగదు. - శ్రీ నారద మహాపురాణం