" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 3 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము తిథి : పూర్ణిమ సా. 05గం౹౹31ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : మూల ఉ. 11గం౹౹40ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం : బ్రహ్మ మ. 03గం౹౹45ని౹౹ వరకు తదుపరి ఐంద్ర కరణం : విష్టి ఉ. 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు & మ. 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 10గం౹౹08ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు & రా. 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు 👉🏻🕉️వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ, రుద్ర సావర్ణిక మన్వాది,🕉️👈🏻 గురుబోధ గురువును ఆశ్రయించనివాడు, గురూపదేశం లేనివాడు రాణించడు, తరించడు అని సాక్షాత్తూ గోవిందుడే అన్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్ అని జనులు నిరంతరం కృష్ణుని జగద్గురువుగా స్తుతిస్తున్నారు. సర్వగురుడు, పరమాత్మ అయి ఉండి కూడా శ్రీకృష్ణుడు, గురువును సేవించనివారి జీవితం వ్యర్థం అని లోకానికి చాటడానికి సాందీపుని ఆశ్రయించాడు. శ్లో|| యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యాసద్ధీః శ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్ || (శ్రీమద్భాగవతం - స్కం.7, అ.15, శ్లో.26 మన మనస్సులలో జ్ఞానం అనే దీపం వెలిగించే గురువు సాక్షాత్తూ భగవంతుడే. అటువుంటి గురువును సామాన్యమానవునిగా భావించే మూర్ఖుడు, బుద్ధిహీనుడు ఎంత చదివినా వ్యర్థులే. గురువును దైవంలా పూజించని అజ్ఞాని పాండిత్యం గజస్నానంలాగా వ్యర్థం అవుతుంది. ఏనుగు స్నానం చేసి పైకి రాగానే చెత్తను తొండంతో మీద జల్లుకొంటుంది. అలాగే గురుపూజలేనివాని చదువు వ్యర్థం. గురువు భగవంతునికి ప్రతిరూపం. గురువును అలా గుర్తించని మూర్ఖులు, ఎన్ని యుగాలైనా తరించరు. జ్ఞానం కలిగిన శిష్యుడు, తన మానవశరీరం గురుసేవకు ఉపయోగించి, పునర్జన్మ లేకుండా చేసుకొంటాడు. ఆచరించవలసిన విధివిధానములు: ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, అర్చించాలి కుదిరితే గురువుని దర్శించి సేవ చేసి, ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు. గురువు అనుగ్రహిస్తే యోగులు కూడా పొందలేనటువంటి శుభాలు, భగవంతుడి అనుగ్రహం ఈ జన్మలోనే పొందవచ్చు. అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాలి.