కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ 30 తె.4.26 కు తదుపరి బ.పాడ్యమి పూర్తి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మూల 30 తె.3.54 కు తదుపరి పూర్వాషాఢ పూర్తి
యోగం: బ్రహ్మ మ.3:18 కు తదుపరి ఐంద్ర 30 సా.4:04 కు
కరణం: విష్టి సా.4:17 కు తదుపరి బాలవ 30 సా.6:33 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.45 - 1.37 కు, మ. 3.21 - 4.13 కు
వర్జ్యం: ఉ.10.09 - 11.56 కు, రా.2.08 - 3.56 కు
అమృతకాలం: రా. 08.57 - 10.45 కు
సూర్యోదయం: ఉ. 5.48 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ జ్యేష్ఠ పూర్ణిమ, వటసావిత్రీ తిథి, భౌత్య మన్వాది, కబీర్ దాస్ జయంతి 🕉️
గురుబోధ:
🕉️ఈ తిథిని వటసావిత్రీ తిథి అని అంటారు. ఈ తిథి చాలా గొప్పది, పుణ్య తిథి. కాశీలో వటసావిత్రి అని ఒక దేవత, యమరాజేశ్వరలింగానికి దగ్గరలో ఉన్నది. ఈ రోజున ఆ దేవతకి పూజ చేస్తారు. కాశీలో యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన లింగం యమరాజేశ్వరలింగం అని పిలవబడుతున్నది.
🕉️ఈ రోజున మన ఇంట్లో మఱ్ఱి చెట్టు కింద కానీ, లేక మఱ్ఱి ఆకు మీద కానీ, ఈ వటసావిత్రీదేవిని కానీ గాయత్రీదేవిని కానీ పెట్టుకుని పూజ చేయాలి. పూజ చెయ్యలేకపోయినా త్రికాలాలలో అనగా ఉదయం 6 గం.లకు, మధ్యాహ్నం 12 గం.లకు, సాయంత్రం 6 గం.లకు చేతిలోకి నీళ్ళు తీసుకుని తర్పణాలు వదలాలి. అలా వదిలేటప్పుడు “ ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి” అని వదిలిపెడితే అనంతపుణ్యం లభిస్తుంది.
🕉️ మహాత్ములైన మనువుల చరిత్రలు భక్తిశ్రద్ధలతో వినాలి, అప్పుడప్పుడు వారిని గుర్తుకు తెచ్చుకోవాలి. మానవులకు అనేక ఋణములను తొలగించి, మోక్షాన్ని ప్రసాదించే చరిత్రలు అవి.
భౌత్య సావర్ణి మనువు చరిత్ర 👉 https://youtu.be/jc0pWEZVgrg?si=_wB7s-SBsoOpY_yV
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial