July 29 2026జులై 29 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ రా.7.17 కు తదుపరి బ.పాడ్యమి 30 రా.8.30 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తారాషాఢ సా.3.59 కు తదుపరి శ్రవణం 30 సా.5.53 కు
యోగం: ప్రీతి రా.11.57 కు తదుపరి ఆయుష్మాన్ పూర్తి
కరణం: బవ రా.8:05 కు తదుపరి కౌలవ 30 రా.9:30 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.57 - 12.48 కు
వర్జ్యం: రా.8.18 - 10.01 కు
అమృతకాలం: ఉ. 08.34 - 10.19 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు

🕉️ ఆషాఢపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ 🕉️

గురుబోధ:
వ్యాసో నారాయణో హరిః అని సమస్త జగత్తూ ఆయన్ని కీర్తించింది. శ్రీ మన్నారాయణుడు భూమి మీద ఎత్తిన 22 అవతారములలో ఒక దివ్యావతారము వ్యాసావతారం. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు అవిర్భవించినట్టుగా పురాణాలు చెపుతున్నాయి. వేదములను విభజించి, అష్టాదశపురాణాలు, ఉపపురాణాలు, సమస్తధర్మాలు, బ్రహ్మసూత్రాలు అందించిన శ్రీ వేదవ్యాసమహర్షి జన్మించిన రోజు ఆషాఢపూర్ణిమ. ఆ మహానుభావుడి జన్మతిథిని గురుపూర్ణిమగా జరుపుకుంటూ వ్యాసుడిని గురువులరూపంలో పూజించుకోవడం అనాదిగా వస్తున్న మన సత్సంప్రదాయం. త్రిమూర్తి స్వరూపమైన గురువు అనుగ్రహిస్తే యోగులు కూడా పొందలేని వైకుంఠమును తక్షణం ఈ జన్మలోనే పొందవచ్చు.
🕉️అందువల్లే గురువుని తప్పక పూజించాలి. తమ గురువే వ్యాసులనుకోవాలి. వ్యాసభగవానుడి అష్టోత్తరం చదువుకోవాలి.
🕉️ఈ పూట ఎంత ఎక్కువగా గురునామస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలు పొందుతారు.
🕉️మనం ఎక్కడ ఉన్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితే గురువుని దర్శించి సేవచేసి, ప్రదక్షిణ చేసి యథాశక్తి దక్షిణ సమర్పించాలి.
🕉️గురువులకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి.
🕉️అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురుపాదాలు పట్టుకోవాలి.

వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ👇
https://youtu.be/qHXpER8YyZI?si=PpHfMzQLl928CXMd
వేదవ్యాస వైశిష్ట్యం👇
https://youtu.be/FhbzIfYiepc?si=8ZTdDlpodnUOGym9
వేదవ్యాస అష్టోత్తరశతనామావళి👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-vedavyasa-ashtottara-satanamavali/
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టోత్తరశతనామావళి👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-guru-ashtottara-satanamavali/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less