కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి రా. 8.41 కు తదుపరి దశమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: భరణి మ. 2.31 కు తదుపరి కృత్తిక
యోగం: గండ సా. 05.55 కు తదుపరి వృద్ధి
కరణం: తైతుల తె. 06.38 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 01.40 కు & మ. 03.24 - 04.15 కు
వర్జ్యం: రా. 1.58 - 3.29 కు
అమృతకాలం: ఉ. 9.59 - 11.29 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
వారణసి కంటే అద్భుతమైన క్షేత్రం మరొకటి లేదు. కాశీ గురించి చెప్పని పురాణం, ఇతిహాసం లేదుగాక లేదు. కావ్యాలలో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు. అంతటి కాశీ అపూర్వం అక్కడ ఉపాసన చేసేవాడు, శరీరం విడిచినవాడు శివునిలో ఐక్యమైపోతాడు. కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం, శ్రీశైలం మొదలైన దివ్యక్షేత్రాల్లో ఉపాసనలు, ప్రదక్షిణలు చేయగా కాశీలో నిత్యనివాసం చేసే మహాయోగం పడుతుంది. - శ్రీ స్కాందపురాణం