July 29 2023జులై 29 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి ఉ. 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (30వ తేది ఉదయం 07గం౹౹04ని౹౹ వరకు)
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : జ్యేష్ఠ రా. 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : బ్రహ్మ ఉ. 09గం౹౹34ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  విష్టి మ. 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹40ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు 
వర్జ్యం : తె. 04గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹07ని౹౹ నుండి 01గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు

🕉️ఏకాదశి🕉️
ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.


గురుబోధ 
ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

expand_less