"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూలై 29 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : పాడ్యమి రాత్రి 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం : పుష్యమి ఉదయం 09గం౹౹33ని౹౹ ఉంది తదుపరి ఆశ్లేష యోగం : సిద్ధి ఈ రోజు సాయంత్రం 06గం౹౹36ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : కింస్తుఘ్న మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 11గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని ◆ శ్రావణమాసం ఆరంభం. శ్రావణ శుక్రవారం గురుబోధ* వాల్మీకి రామాయణం లోని 24,000 శ్లోకములను లేదా కనీసం సుందరకాండములోని శ్లోకములను వ్రాయడం, చదవడం వల్ల తప్పక వైకుంఠప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతి.