కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 28 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి సా.5.42 క తదుపరి పూర్ణిమ 29 రా.7.17 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ మ.1.43 కు తదుపరి ఉత్తారాషాఢ 29 సా.3.59 కు
యోగం: ప్రీతి రా.11:57 కు తదుపరి ప్రీతి 29 రా.11.57 కు
కరణం: వణిజ సా.6:19 కు తదుపరి బవ 29 రా.8:05 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.31 - 9.23 కు, రా. 11.15 - 12.00 కు
వర్జ్యం: రా.10.28 - 12.13 కు
అమృతకాలం: ఉ. 07.50 - 09.37 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
ఆషాఢమాసం దేవతలకు చాలా ప్రీతికరం. ఈ మాసంలో చేసే దేవతారాధన, జప, పారాయణములు, పురాణశ్రవణం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.
మంగళవారం చాలా పవిత్రమైన దినం. మంగళ అంటే శుభం అని కూడా అర్థం. అందుకే మంగళవారం చేసే దేవతాకార్యక్రమాలు పూజ, జపం, పారాయణము మొ౹౹ గొప్ప శుభ ఫలితాలను ఇస్తాయి. మఱియు మంగళవారం ఏ కార్యం తలపెట్టినా మళ్ళీమళ్ళీ అదే కార్యం చేస్తామని శాస్త్రం. అందుకే ఆ రోజు అప్పులు తీసుకోకూడదు. అప్పులు తీర్చడానికి మంచిరోజు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial