July 28 2022జూలై 28 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 28 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు  
ఆషాఢమాసం కృష్ణపక్షం 

తిథి : అమావాస్య రాత్రి 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పునర్వసు ఉదయం 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : వజ్ర ఈ రోజు సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : *చతుష్పాద ఉదయం 10గం౹౹19ని౹౹ వరకు తదుపరి నాగవాన్
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 03గం౹౹53ని౹౹ నుండి 05గం౹౹39ని౹౹ వరకు 
అమృతకాలం : ఉదయం 05గం౹౹11ని౹౹ నుండి  06గం౹౹10ని౹౹ వరకు &
తెల్లవారి 02గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని వరకు

గురుబోధ


భోజనం చేస్తున్నప్పుడు విస్తరిలో మొదట ఉప్పు వడ్డించాలని శాస్త్రం. పొరపాటున పప్పు, కూరలలో ఉప్పు తగ్గితే భోజనము మధ్యలో అడిగేవారు కాదు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఉప్పును ఆ పప్పు లేదా కూర పాత్రలలో వేసి మళ్ళీ వడ్డించుకోవడం ఆచారము.

expand_less