కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి ప.3.50 కు తదుపరి చతుర్దశి 28 సా.5.42 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మూల ఉ.11.13 కు తదుపరి పూర్వాషాఢ 28 ప.1.43 కు
యోగం: విష్కంభ రా.11:33 కు తదుపరి ప్రీతి 28 రా.11:57 కు
కరణం: తైతుల మ.4:15 కు తదుపరి వణిజ 28 సా.6:19 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 1.39 కు, మ. 3.22 - 4.13 కు
వర్జ్యం: ఉ.9.26 - 11.13 కు, రా.9.48 - 11.34 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
భూమి మీద పుట్టిన ప్రతిజీవికి కొన్ని ధర్మములు ఉన్నాయి. అందులో ఒకటి గురువును ఆశ్రయించడం. పుడమిలో మనుజులెవ్వరైనా గాని గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకిస్తే తప్ప తరించలేరు. అందుకే రాముడు, కృష్ణుడు సమస్తము ఎరిగిన వారయినప్పటికినీ, జగద్గురువులయినప్పటికినీ, పరిపూర్ణులయినప్పటికినీ గురువును ఆశ్రయించారు. ఈ జన్మల పరంపర నుండి విముక్తి పొందాలి అంటే సంపూర్ణంగా గురువు యొక్క శరణాగతిని పొందాలి. మోక్షాన్ని పొందడం అంత సులభము కాదు కానీ ఎవరైతే గురువుని, భగవంతుడిని సంపూర్ణ శరణాగతి వేడుకుంటారో వారికి మార్గం అత్యంత సులభం అవుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial