July 27 2023జులై 27 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : నవమి ఉ. 10గం౹౹16ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : విశాఖ రా. 09గం౹౹23ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : శుభ మ. 01గం౹౹39ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  కౌలవ మ. 03గం౹౹47ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 01గం౹౹21ని౹౹ నుండి 02గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹26ని౹౹ నుండి 02గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు


గురుబోధ 
విష్ణ్వాలయంలో 4 సంఖ్య తో ప్రదక్షిణలు (4,8,12,16...) అమ్మవారు మరియు శివాలయంలో 3 సంఖ్య తో ప్రదక్షిణలు (3,6,9,12....) చేయాలని శాస్త్రము. మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను సంరక్షించడం  ఎంతో పుణ్యప్రదం. వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడము వల్ల దేవతలు ప్రీతిచెందుతారు. శుభాలు కలిగిస్తారు.


expand_less