కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి ఉ. 5.56 కు తదుపరి షష్ఠి తె. 3.29 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 7.05 కు తదుపరి రేవతి
యోగం: సుకర్మ రా. 01.32 కు తదుపరి ధృతి
కరణం: గరజి మ. 12.42 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.29 - 09.21 కు & మ. 12.49 - 01.40 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 2.35 - 4.04 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.52 కు
గురుబోధ:
ఏదైనా వ్రతం, హోమము, జపము లేదా శుభకార్యం చేసినప్పుడు కొద్దిసేపైనా పురాణప్రవచనం లేదా పురాణ పారాయణము అక్కడ జరిగితే ఆ కార్యక్రమం వల్ల సంపూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం. పురాణము ఎక్కడ జరుగుతుందో అక్కడ సకల దేవతలు అదృశ్యరూపంలో వచ్చి విని ఆశీర్వదిస్తారు. అందుకే శ్రీ రమాసత్యనారాయణస్వామి వ్రతం, సంకష్టహరగణపతి వ్రతం, వినాయకచతుర్థీ వ్రతం, అనంతపద్మనాభస్వామి వ్రతం మొ౹౹ ఏవైనా పురాణకథలు తప్పక ఉంటాయి. అందుకే ఆలయప్రతిష్ఠ లేదా 12 సం౹౹కు ఒకసారి చేసే కుంభాభిషేకం మొదలైన ఉత్సవాలలో కూడా పురాణకార్యక్రమం తప్పక ఏర్పాటు చేసేవారు.