కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 25 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి ప.11.52 కు తదుపరి ద్వాదశి 26 ప.1.49 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అనూరాధ ఉ.6.02 కు తదుపరి జ్యేష్ఠ 26 ఉ.8.35 కు
యోగం: ఐంద్ర రా.10:04 కు తదుపరి వైధృతి 26 రా.10:54 కు
కరణం: బవ రా.12:46 కు తదుపరి బాలవ 26 మ.1:58 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.40 - 8.31 కు
వర్జ్యం: ప.12.14 - 2.00 కు
అమృతకాలం: సా. 09.40 - 11.28 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు
🕉️ తొలిఏకాదశి, చాతుర్మాస ఆరంభం, పండరీపుర పాండురంగ ఉత్సవాలు 🕉️
ఏకాదశీ ఉపవాసం శనివారం ఉండాలి. ద్వాదశీ పారణ ఆదివారం చెయ్యాలి.
గురుబోధ:
1) ఆషాఢ మాసం లో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలువబడుతుంది.
2) శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి నాడు క్షీరసముద్రంలో నిద్రిస్తాడు. విష్ణువు రెండు రూపాలు ధరించి, ఒక రూపంలో క్షీరసముద్రంలో నిద్రపోతాడు. మరొక రూపంతో పాతాళంలో బలిచక్రవర్తిని అనుగ్రహిస్తాడు. ఈ రెండు రూపాలలో ఉన్న విష్ణువునూ పూజించాలి.
ఆచరించవలసిన విధివిధానాలు:
1) యథాశక్తి నారాయణపూజ చేసి, ఉపవాసం ఉండే శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి దానధర్మాలు చేసుకుని ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి పారణ చెయ్యాలి.
2) కటిక ఉపవాసాలు చేసేవారు పాపాత్ములు అవుతారు, ఆత్మహత్య చేసుకున్న వారితో సమానులవుతారు.
3) పూర్తిగా తినకుండా ఉండకూడదు, అలా అని అధికంగానూ తినకూడదు.
4) శరీర సహకారానికి ఏది పడుతుందో అటువంటిది కొద్దిగా స్వీకరించాలి.
5) ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి పూజ, స్మరణం, దానం, ధర్మం, పురాణశ్రవణం మహా ఫలితాలను ఇస్తుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial