July 25 2025జులై 25 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 25 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: శ్రావణ శుద్ధ పాడ్యమి రా.1.38 కు తదుపరి విదియ 26 రా.1.09 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుష్యమి సా.5.21 కు తదుపరి ఆశ్లేష 26 సా.5.28 కు
యోగం: వజ్ర ఉ.7:27 కు తదుపరి వ్యతీపాత 26 తె.4:05 కు
కరణం: కింస్తుఘ్న ప.11.58 కు తదుపరి బవ రా.11.23 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8:31-9:22 కు, మ. 12:48-1:39 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ.9.48-11.21 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు

🕉️ శ్రావణమాసం ఆరంభం, తొలి శ్రావణ శుక్రవారం🕉️

గురుబోధ:
శ్రావణ మాసం ఎంతో విశేషమైన మాసము. ఈ మాసం లో మంగళగౌరీ పూజలు , లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు. శ్రావణం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్యకారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చు.

expand_less