" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 25 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : సప్తమి ఉ. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : చిత్త రా. 08గం౹౹10ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : సిద్ధ మ. 03గం౹౹02ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : వణిజ మ. 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹36ని౹౹ వరకు అమృతకాలం : మ. 01గం౹౹20ని౹౹ నుండి 03గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు గురుబోధ మనం ఏ గుడికి వెళ్లినా సాష్టాంగం పడినప్పుడు మన కాళ్లు దేవుని వైపు ఉన్నాయో లేదో గమనించాలి. పొరపాటున హనుమంతునికి గరుత్మంతునికి, నందీశ్వరునికి హంసవాహనం వైపు మూషికవాహనం వైపు కాళ్లు చూపించి సాష్టాంగం చేస్తే దానివలన సంపూర్ణ ఫలితం రాదు. మాయ మనలను పట్టుకుంటుంది, ఇది సూక్ష్మధర్మం, వేదధర్మం. ధ్వజస్తంభం వైపు సూటిగా కాళ్లు చూపినా ఇది మనకు ప్రమాదం కలిగిస్తుంది. భగవంతునికి భక్తితో నమస్కారం చేసేటప్పుడు భక్తితో పాటు, జ్ఞానం కూడా ఉండాలి. బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పిన మాట అదే. పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. ఆలయం బయట ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ పడితే అది చాలా పుణ్యం.