"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 25 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : ద్వాదశి సాయంత్రం 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : మృగశిర రాత్రి 01గం౹౹50ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : ధ్రువ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹04ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం : తైతుల సాయంత్రం 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 06గం౹౹16ని౹౹ నుండి 07గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹09ని౹౹ నుండి 05గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని౹I
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయాలి.
గురుబోధ
నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతాపూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య, సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేషపూజలు, జపములు మొదలైనవి. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచరించే అర్హత కలుగుతుందని శాస్త్రం.